టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి రివ్యూ

  • 3 years ago
భారతదేశంలో టీవీఎస్ మోటార్ కంపెనీ యొక్క అత్యంత ప్రాచుర్యం చెందిన మోటార్ సైకిల్స్ లో ఒకటి ‘అపాచీ ఆర్‌టిఆర్ సిరీస్’. ఈ సిరీస్ లో స్పోర్టి 160 సిసి సమర్పణల నుండి మరియు ఆర్‌టిఆర్ 200 4 వి మోడల్ వరకు ఉన్నాయి.

టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ సిరీస్ రేంజ్-టాపింగ్ మోడల్ అయిన ఆర్‌టిఆర్ 200 4 వి మోడల్ 2020 లో అప్డేట్ చేయబడింది. ఆ సమయంలో ఈ బైక్ కొత్త రూపకల్పనలో మార్పులను అందుకోవడమే కాకుండా, కొత్త ఫీచర్స్ మరియు పరికరాలను అందుకుంది. ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ 2021 లో గణనీయమైన మార్పులను పొందినప్పటికీ, కొన్ని కొత్త ఫీచర్స్ అందుకోవడం జరిగింది. రద్దీగా ఉండే బెంగళూరు నగరంలో మాత్రమే కాకుండా, మెట్రోపాలిటన్ చుట్టూ ఉన్న హైవేలలో కూడా ఈ కొత్త బైక్ ను రెండు రోజులు పాటు రైడ్ చేసాము. కావున 2021 మోడల్ లో ఉన్న కొత్త అప్డేట్స్ ఏమిటి మరియు ఇది వాస్తవ ప్రపంచంలో ఎలా ఉంటుంది అనే మరిన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

Recommended