Food Safety And Standards Authority Of India Release Bird Flu Guidelines | Oneindia Telugu

  • 3 years ago
Amid the bird flu scare across the nation, Food Safety and Standards Authority of India (FSSAI) on Thursday advised people not to eat half-boiled eggs and undercooked chicken, and ensure proper cooking of poultry meat as it came out with a detailed set of guidelines.
#BirdFlu
#Covid19VaccinationDrive
#Covid19Vaccine
#BirdFluGuidelines
#FSSAI
#VKSasikala
#AgricultureBills
#PMModi

* బర్డ్ ఫ్లూ మహమ్మారి విస్తరణ నేపథ్యంలో హై టెన్షన్ నెలకొంది. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు విడుదల చేసింది. బర్ద్ ఫ్లూ వైరస్ 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 3 సెకన్లలో చనిపోతుందని వెల్లడించింది. మాంసం, గుడ్లు 74 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉడికించితే వైరస్ చనిపోతుందని స్పష్టం చేసింది. కోళ్లు/ ఆధారిత రంగానికి సంబంధించిన ఉత్పత్తులపై ఆధారపడ్డ వ్యాపారవేత్తలు, వినియోగదారులు భయపడొద్దని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ స్పష్టంచేసింది. వ్యాపారవేత్తలు, వినియోగదారులు ఏం చేయాలో.. ఏమి చేయకూడదనే అంశంపై మార్గదర్శకాలలో వివరించింది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు, అపోహలను తొలగించేందుకు ఏమి చేయాలో.. ఏమీ చేయకూడదో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ సవివరంగా తెలియజేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వైద్య బృందాలతో టాస్క్ ఫోర్స్ కమిటీలను వేసి.. కోళ్ల ఫారాలు.. ఇతర పక్షి, జంతు కేంద్రాలను పశు వైద్య నిపుణులు తనిఖీ చేస్తున్న నేపధ్యంలో మార్గదర్శకాలు విడుదల చేశారు. చికెన్ వంట చేసే సమయంలో మధ్యలో తినకూడదని మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో పక్షులతో దగ్గరగా ఉండొద్దని తెలిపింది. చనిపోయిన పక్షులను చేతులతో తాకవద్దని కోరింది. పచ్చి మాంసాన్ని ఖాళీ ప్రదేశంలో ఉంచొద్దని.. ప్రత్యక్షంగా తాకవద్దని వివరించింది. పచ్చి చికెన్ ను ముట్టుకునే సమయంలో మాస్కు, గ్లౌజు తప్పనిసరిగా ధరించాలని కోరింది. పచ్చి మాంసం ఉంచే ప్రదేశాలు, సమీప ప్రదేశాలను కూడా శుభ్రంగా ఉంచాలని స్పష్టంచేసింది. పూర్తిగా ఉడికించిన కోడి మాంసం, గుడ్లు మాత్రమే తీసుకోవాలని వెల్లడించింది.

Recommended