2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ

  • 3 years ago
ఎంజి మోటార్ 2019 లో తన హెక్టర్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ లాంచ్ అయిన తరువాత, దాని డిజైన్, ధర మరియు ఫీచర్స్ కారణంగా దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. సాధారణంగా చాలా మంది కార్ల తయారీదారులు ఏదైనా కొత్త వాహనాన్ని ప్రారంభించిన రెండు సంవత్సరాల తరువాత ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌ను తీసుకు వస్తారు. కానీ ఎంజి మోటార్ యొక్క హెక్టర్ మాత్రం ప్రారంభించిన 18 నెలల కాలంలోనే కొత్త ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది.

ఎంజి మోటార్ కంపెనీ యొక్క కొత్త 2021 ఎంజి హెక్టర్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, దీని ప్రారంభ ధర రూ. 12,89,800 (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 18,32,800 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. హెక్టర్ ప్లస్‌లో మొదట ప్రవేశపెట్టిన కొత్త స్టార్రి బ్లూ కలర్ ఇప్పుడు స్టాండర్డ్ హెక్టర్ మోడల్‌కు కూడా జోడించబడింది.

2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Recommended