Burevi Cyclone May Effect On Nellore Chittoor And Prakasam Distircts In Andhra Pradesh
  • 3 years ago
Burevi Cyclone : In less than a week after Cyclone Nivar swept past Tamil Nadu and Andhra Pradesh, another cyclone started to brew over the Bay of Bengal. The low-pressure area lingering over the Bay intensified into a depression during early hours of Monday. As per the India Meteorological Department (IMD) forecast, the system is likely to intensify into a ‘deep depression’ by Monday night and further into a cyclonic storm by Tuesday morning.
#BureviCyclone
#CoronaVaccine
#PMModi
#COVID19
#APCMJagan
#NivarCyclone
#AndhraPradesh
#ViratKohli
#IndvsAus2020
#Cricket

నివర్ తుపాను మిగిల్చిన నష్టం మరువకముందే మరో తుపాను ఏపీలోని పలు జిల్లాల ప్రజలను భయడపెడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం మరింతగా బలపడుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది మరింతగా బలపడి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపానుకు బురేవి అని పేరు పెట్టారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ సుమారు డిసెంబర్‌ రెండో తేది సాయంత్రం శ్రీలంక మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
దీని ప్రభావం వల్ల రానున్న 36 గంటల్లో ఏపీలోని దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ భావిస్తోంది. రాయలసీమ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Recommended