Twitter Removes Amit Shah Display Photo | Oneindia Telugu
  • 3 years ago
Twitter given clarification on Union Home Minister Amit Shah's twitter account Profile Picture was locked. Twitter Spoke person says that We temporarily locked this account under our global copyright policies. This decision was reversed immediately and the account is fully functional.
#AmitShah
#AmitShahProfilePicture
#Twitter
#UnionHomeMinister
#Ladakh
#Leh
#JammuAndKashmir
#India
#PMModi

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానకు అనూహ్యంగా షాక్ ఇచ్చింది. ఆయన ట్విట్టర్ ప్రొఫైల్ ఫొటోను కొంత సమయం పాటు లాక్ చేసింది. ప్రొఫైల్ ఫొటోకు బదులుగా- దాన్ని ఎందుకు డిస్‌ప్లే చేయట్లేదో, ఎందుకు లాక్ చేయాల్సి వచ్చిందనే సమాచారాన్ని ఉంచింది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లఢక్‌లోని కొన్ని కీలక ప్రదేశాలను చైనా భూభాగానికి చెందినట్లు గుర్తించడం పట్ల ట్విట్టర్‌కు నోటీసులను జారీ చేసిన రోజే.. అమిత్ షా ప్రొఫైల్ ఫొటోకు తాళం పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విఫయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుంది. వివరణ ఇవ్వాలని ట్విట్టర్ ఇండియా యాజమాన్యాన్ని ఆదేశించింది. వివరణ కోరిన కొద్దిసేపటికే ఆయన ప్రొఫైల్ ఫొటోను పునరుద్ధరించింది ట్విట్టర్ యాజమాన్యం.
Recommended