Lockdown Until June మరో రెండు నెలలు కరోనా మీద యుద్దం, లాక్‌డౌన్ జూన్ వరకు పొడగించే అవకాశం!!
  • 4 years ago
There are concerns that it will take another three weeks for the cases to recur and the whole thing can be recovered from the corona outbreak. There is no possibility for central and state governments to extend the lockdown restrictions until the end of May. It is clear that the lockdown restrictions could be extended until June if the vaccine itself can be fully restrained by the unexplained corona epidemic.
#coronaviruslockdown3.0
#lockdownuntiljune
#lockdownextended
#coronapositivecases
#PMModi

గత నలభై రోజులుగా స్వీయ నియంత్రణ పాటిస్తు లాక్‌డౌన్ ఆంక్షలను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నా కరోనా కష్టాలు రెట్టింపవుతున్నాయి తప్ప తగ్గముఖం పట్టడంలేదు. కేసులు తగ్గుతాయోమోనని కేంద్రంతో పాటు రాష్ట్ర వర్గాల్లో ఆశాభావం నెలకొంది. కేసులు సంఖ్య గంటగంటకూ విస్తరిస్తూనే ఉన్నాయి. దీంతో కరోనా వైరస్ ను కట్టడి చేసి తీరుతామని కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా మూడో లాక్ డౌన్ ముగిసే వరకు కూడా కరోనా పాజిటీవ్ కేసుల ఉదృతి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. కరోనా ఉదృత వ్యాప్తి నుంచి మళ్లీ కేసులు తగ్గి అంతా అదుపులోకి రావడానికి మరో మూడు వారాల సమయం పట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మే నెల చివరి వరకూ లాక్‌డౌన్ ఆంక్షలను పొడిగించాలనుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అది సాద్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. వాక్సీన్ కూడా కనిపెట్టలేని కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి రావాలంటే లాక్‌డౌన్ ఆంక్షలను జూన్ వరకు పొడగించే అవకాశం ఉందని స్పంష్టంగా నిర్ధారణవుతోంది. అంటే మరో రెండు నెలలు కరోనా మీద యుద్దం చేయక తప్పని పరిస్ధితులు నెలకొన్నాయన్న మాట.
Recommended