Share Market Update : Equity Indices Upbeat in Early Trade
  • 4 years ago
Equities trading firm during early hours on April 09 in line with Asian peers after Wall Street's overnight rally with investors hoping that coronavirus pandemic in the United States was nearing its peak. At 10:15 am, the BSE S&P Sensex was up by 785 points or 2.62 per cent at 30,679 while the Nifty 50 edged higher by 245 points or 2.8 per cent at 8,993. All sectoral indices at the National Stock Exchange were in the green with Nifty pharma up by 5.6 per cent, auto by 4.8 per cent, metal by 4.1 per cent and private bank by 3.7 per cent.
#ShareMarket
#NationalStockExchange
#Sensex
#Nifty
#stocks
#BSE
#investors
#lockdown

నిన్న (ఏప్రిల్ 8) నష్టాల్లో ముగిసిన మార్కెట్లు గురువారం లాభాల్లోకి వచ్చాయి. ఈ రోజు ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 748.97 పాయింట్లు (2.51%) లాభపడి 30,642.93 వద్ద, నిఫ్టీ 217.45 పాయింట్లు (2.49%) ఎగిసి 8,966.20 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. కొద్ది సమయానికి సెన్సెక్స్ 833 పాయింట్లు ఎగిసి 30,727కు చేరుకుంది. నిఫ్టీ 9వేల పాయింట్లు దాటింది. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,131 పాయింట్లు ఎగిసి 31,000 మార్క్ కూడా దాటింది. 764 షేర్లు లాభాల్లో, 82 షేర్లు నష్టాల్లో ఉండగా 25 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. దాదాపు అన్ని రంగాలు కూడా ఈ రోజు లాభాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2 శాతం పెరిగాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఆటో షేర్లు 5 శాతం మేర లాభాల్లోకి వచ్చాయి. బీఎస్ఈలోను అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ఉన్నాయి.