Malaysian PM Mahathir Mohamad Slips on Palm Oil Resigns | Oneindia Telugu
  • 4 years ago
Malaysian Prime Minister Mahathir Mohamad submitted his resignation to the country's king on Monday. After palm oil many other Malaysian exports may face restrictions from India as the Modi administration expresses anger over Malaysian PM's CAA remark.
#malaysiapm
#MahathirMohamad
#AnwarIbrahim
#pmmodi
#Malaysianpolitics
#palmoilimports
#Malaysiapalmoil
#refinedpalmoil

మన పొరుగు దేశం మలేసియాలో పెను రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఏకంగా ఈ దేశ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే స్థాయికి చేరుకుంది. మలేసియా ప్రధానమంత్రి మహతిర్ మహమ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. మరి కాస్సేపట్లో ఆయన మలేసియా చక్రవర్తిని కలిసి.. తన రాజీనామా ప్రతాన్ని అందజేయనున్నారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మలేసియాలో శరవేగంగా పావులు కదులుతున్నాయి. మహతిర్ మహమ్మద్ రాజీనామా చేయడానికి గల కారణాలపై వెల్లడించడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. రాజకీయ కారణాలే ఈ పరిస్థితికి దారి తీసి ఉండొచ్చని మలేసియా మీడియా వెల్లడించింది. 94 సంవత్సరాల మహతిర్.. 2018లో రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. యునైటెడ్ మలయాస్ నేషనల్ ఆర్గనైజేషన్ (యుఎంఎన్ఓ) సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు.