3 years ago

Viral Video : Lioness & Her Cubs Make Way For Biker In Gujarat

Oneindia Telugu
Oneindia Telugu
Viral Video : A video filmed near the Gir National Park and Wildlife Sanctuary in Gujarat shows a lioness and her two cubs moving to make way for a biker.
#ViralVideo
#viralvideos
#videoviral
#viralnews
#lionvideos
#Lioness
#funnylionvideos
#GirNationalPark
#wildlion

గుజరాత్ గిర్ అడవులు సింహాలకు ఫేమస్. అక్కడ నిత్యం సింహాలు ఒక గుంపులో సంచరిస్తూనే ఉంటాయి. సింహాలు సంచరిస్తున్న పలు వీడియోలు కూడా బయటపడ్డాయి. ఇక ఈ సింహాలను చూసేందుకు చాలామంది జంతుప్రేమికులు ఈ అడవుల సమీపంవరకు వెళతారు. తాజాగా సింహాల గుంపు వెళుతున్న ఓ వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తోంది. గిర్ జాతీయ పార్కులో అప్పటి వరకు నడిరోడ్డుపై ఉన్న సింహం ఒక్కసారిగా లేచి నడుస్తూ వెళుతుండగా దాని వెనక తన రెండు సింహం పిల్లలు ఫాలో అయ్యాయి. అలా వెళుతుండగా ఎదురుగా బైకుపై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. సింహాలను చూసి ఒక్కసారిగా బైకును ఆపేశారు. వీరికి భూమిపై నూకలు ఇంకా మిగిలే ఉండటంతో ఆ సింహం దాడి చేయలేదు.
పైగా తాను అడ్డంగా వచ్చానని తెలుసుకుందో ఏమో తెలియదుగానీ ఈ బైకుపై వెళ్లే వారికి దారి ఇచ్చింది. అంటే ఈ సింహం పక్కకు తప్పుకుని గడ్డిలోకి వెళ్లిపోయింది. ఇక ఈ వీడియోను రాజ్యసభ ఎంపీ పరిమాల్ నత్వానీ ట్విటర్‌లో పోస్టు చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. అంతేకాదు మనుషులను సింహాలు గౌరవించడం అనేది చాలా అద్భుతం అని ఆయన పోస్టులో రాసుకొచ్చారు.

Browse more videos

Browse more videos