ఆశ్చర్యం, మనిషి ముఖంతో జన్మించిన మేక పిల్ల, అది ఎలా ఉందొ చుడండి.

  • 4 years ago
దేశంలో మేకను పేదవాని ఆవు అంటారు. మెట్ట సేద్యంలో మేకల పెంపకం అతిప్రముఖమైన ఉపాధి. ఆవు, గేదె వంటి పశువుల పెంపకానికి అనువుగాని మెట్టపల్లాల ప్రాంతాలలో మేకల పెంపకం ఒక్కటే సాధ్యం. సన్నకారు రైతాంగానికి మేకల పెంపకం అతి తక్కువ పెట్టుబడితో లాభదాయక వృత్తి. మేకలు మానవులకు బాగా ఉపయోగకరమైన జంతువులు. వీటి నుండి పాలు, మాంసం, తోలు మొదలైనవి లభిస్తాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు పేదవారికి వీటిని దానమిస్తాయి. ఎందుకంటే పశువుల కంటే వీటిని పెంచడం చాలా సులువు, తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు విస్తృత ఉపయోగాలు ఉన్నాయి. మేక పేగుల నుండి శస్త్రచికిత్సలో ఉపయోగించే ‘కేట్ గట్’ అనే దారాన్ని తయారుచేస్తారు. మేక కొమ్ముల నుండి చెంచాలు తయారుచేయవచ్చును.రాజస్తాన్ లోని నిమోడియా అనే గ్రామంలో ఈ మధ్య ఓ విచిత్రం జరిగింది. అక్కడ ఓ నల్లని మేకపిల్ల మనిషి ముఖంతో పుట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మనిషి కళ్ళు, నోరు వంటి అవయవాలతో పుట్టిన ఈ మేకను అంతా భగవంతుని అవతారమేనని పూజించడం మొదలెట్టారు. ఈ మేక తాలూకు వీడియోను దీని యజమాని ముకేష్ జీ ప్రజాపాప్ రిలీజ్ చేశారు. అయితే ‘సైక్లోపియా ‘ అనే జన్యు సంబంధ లోపమే ఇది ఇలా పుట్టడానికి కారణమంటున్నారు. ఇక-2017 లో కూడా అస్సాం లోని ఓ గ్రామంలో ఒంటి కన్నుతో జన్మించిన మేకపిల్ల సంచలనం రేపింది. దానికి చెవులు, కనుబొమలు ఉన్నాయి. అయితే ముక్కుభాగం దాదాపు మూసుకుపోయింది.. కాగా.. ఇలా జన్యు లోపంతో పుట్టిన జీవాలు ఎక్కువకాలం జీవించలేవని అంటున్నారు.

Recommended