AP 3 Capitals : Farmers Palabhishekam To Legislative Council Chairman Shariff || Oneindia Telugu
  • 4 years ago
In a major setback to the ruling YSR Congress Party (YSRCP), the chairman of the Andhra Pradesh legislative council on Wednesday decided, on his own discretion, that two bills relating to the decentralization of the state’s capital and repealing of the AP Capital Region Development Authority (APCRDA), should be sent to a select committee.
ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలనే మండలి ఛైర్మన్ నిర్ణయం పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
టీడీపీ నేతలు..రాజధాని గ్రామాల ప్రజలు షరీఫ్ ను అభి నందిస్తున్నారు. బిల్లులపై ఆయన ఈ నిర్ణయం తీసుకోగానే మండలిలోని టీడీపీ సభ్యులు సంబరాలు చేసుకొన్నారు.
ఛైర్మన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి రాజధాని ప్రాంత వాసులు ప్రశంసలతో ముంచెత్తారు. ఇక, ఛైర్మన్ తన విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకున్నాని చెప్పటం పైన వైసీపీ..బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. మంత్రులు కొందరు ఛైర్మన్ ను దూషించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటి పైన మాత్రం ఛైర్మన్ స్పందన ఆసక్తి కరంగా మారింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మండలి ఛైర్మన్ షరీఫ్ హాట్ టాపిక్ మారారు.
#AP3Capitals
#apLegislativeCouncil
#ChairmanShariff
#Palabhishekam
#APCRDA
#amaravathifarmers
#decentralization
#selectcommittee
Recommended