Indvs SL 2nd T20I : Shreyas Iyer 101 Meters Long Six But Trolls On Virat And Iyer's Reactions
  • 4 years ago
India vs Sri Lanka 2nd T20I : Iyer hit a six during his innings which hit the roof of the stadium. Later virat kohli reaction is speech less
#IndiavsSriLanka2ndT20I
#CricketNews
#IndVsSL3rdt20iCricket
#Dhawan
#viratkohli
#ShreyasIyer
#ShardulThakur
#ShreyasIyersix


మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం హోల్కర్‌ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యంను భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్‌లోనే ఛేదించింది. కేఎల్‌ రాహుల్‌ (45; 32 బంతుల్లో 6 ఫోర్లు), శ్రేయస్‌ అ‍య్యర్‌ (34; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్ కోహ్లీ ( 30 నాటౌట్‌; 17 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్‌) టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అయ్యర్ కొట్టిన ఓ సిక్స్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అ‍య్యర్‌లు ఉన్నారు. టీమిండియా విజయానికి 25 బంతుల్లో 28 పరుగులు కావాలి. ఈ దశలో లంక స్పిన్నర్ హసరంగ వేసిన బంతిని ముందుకు వచ్చిన అయ్యర్.. మిడ్‌వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అంతే.. బంతి వెళ్లి స్టేడియం పైకప్పుని తాకి కింద పడింది.
Recommended