MS Dhoni Picked Captain Of ESPNCricinfo's ODI And T20 Teams Of Past Decade !

  • 4 years ago
Former India skipper Mahendra Singh Dhoni was on Wednesday picked as captain of ESPNCricinfo's ODI and Twenty20 teams of the decade, while Virat Kohli was named the leader in Tests.
#MSDhoni
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#jaspritbumrah
#klrahul
#rishabpanth
#cricket
#teamindia
ఈ దశాబ్దం క్రికెట్‌ ప్రపంచంలో టీమిండియా ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లాంటి మరెందరో ఆటగాళ్లు అద్భుతంగా ఆడి టీమిండియాకు విజయాలను అందిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కోహ్లీ, ధోనీలు అగ్రస్థానంలో ఉన్నారు. మాజీ క్రికెటర్లు, పలు సంస్థలు వెల్లడిస్తున్న ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో ఈ ఇద్దరు ఉంటున్నారు.
ప్రముఖ క్రీడా ప్రసార సంస్థ ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫో ఈ దశాబ్దపు టెస్టు, వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. వన్డే, టీ20 జట్లకు కెప్టెన్‌గా ధోనీని ఎంపిక చేసింది. ఇక టెస్టు జట్టుకు సారథిగా కోహ్లీ వైపు మొగ్గు చూపింది. 23 మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ పలు అంశాలను పరిగణలోకి తీసుకుని టెస్టు, వన్డే, టీ20 జట్లను ప్రకటించినట్లు ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫో పేర్కొంది.
ఈ దశాబ్దంలో ఆరేళ్లకు పైగా ఆడి ఉండి లేదా కనీసం 50 టెస్టులైనా ఆడిన ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని టెస్టు జట్టును ప్రకటించినట్టు ఈఎస్‌పీఎన్‌ తెలిపింది. కనీసం 75 వన్డేలు, 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల రికార్డులను దృష్టిలో ఉంచుకుని వన్డే, టీ20 జట్లకు ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు వివరించింది.
టెస్టు జట్టులో విరాట్ కోహ్లీతో పాటు టీమిండియాకు చెందిన మరో ఆటగాడు ఆర్ అశ్విన్‌కు మాత్రమే క్రిక్‌ఇన్‌ఫో చోటు ఇచ్చింది. ఇక వీరితో పాటు ఇంగ్లండ్‌ మాజీ ఓపెనర్‌ అలిస్టర్‌ కుక్‌, న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌లు టెస్టు జట్టులో ఉన్నారు. వన్డేల్లో ధోనీ, కోహ్లీలతో పాటు రోహిత్‌ శర్మకు చోటిచ్చింది.
క్రిక్‌ఇన్‌ఫో టీ20 ఫార్మట్‌లో వెస్టిండీస్‌ ఆటగాళ్లకు పెద్దపీట వేసింది. ఏకంగా ఐదుగురు ఆటగాళ్లకు చోటు కల్పించింది. క్రిస్‌ గేల్‌, డ్వేన్‌ బ్రేవో, సునీల్‌ నరైన్‌, కీరన్ పొలార్డ్‌, ఆండ్రీ రసెల్‌లు ఉన్నారు. ఇక టీమిండియా నుండి ధోనీతో పాటు కోహ్లీ, బుమ్రాలను జట్టులోకి తీసుకుంది.
మిథాలీ, జులన్‌లకు చోటు
మహిళల క్రికెట్‌లో మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామిలకు వన్డే, టీ20 జట్టులో క్రిక్‌ఇన్‌ఫో చోటు ఇచ్చింది. ఈ రెండు ఫార్మట్లకు ఆసీస్‌ క్రికెటర్‌ మెగ్ లాన్నింగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

Recommended