#happynewyear2020 : Only calendar Has Changed your Spouse Remain The Same

  • 4 years ago
Indian captain Virat Kohli, who is currently in Switzerland with wife and Bollywood actor Anushka Sharma, posted a video for new year wishes for all.
And Harbhajan Singh tweets Don’t be too excited about this New Year stuff.only the calendar has changed.your spouse,job and targets remain the same..
just a small reminder. Happy new year to you all
#2020NewYear
#Happy2020
#happynewyear2020
#NewYearcelebrations
#HarbhajanSingh
#ViratKohli
ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్నో జ్ఞాప‌కాల‌తో కూడిన 2019 సంవ‌త్స‌రానికి గుడ్‌బై చెప్పి 2020కి ఘ‌న స్వాగ‌తం ప‌లికాం. నూతన సంవ‌త్స‌రంలో కోరుకున్న ప‌నులు జ‌ర‌గాల‌ని, ఈ ఏడాది కూడా అంతకుమించి జ్ఞాప‌కాల‌తో సంతోషంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. నూతన సంవ‌త్స‌రం సందర్భంగా టీమిండియా క్రికెటర్లు, మాజీలు సోష‌ల్ మీడియా ద్వారా తమ అభిమానుల‌కి శుభాకాంక్ష‌లు తెలిపారు. కొత్త సంవ‌త్స‌రం అందరి జీవితంలో కోటి ఆశ‌ల‌ని చిగురింప‌జేయాల‌ని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు.


టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ అభిమానులకు నూతన సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపాడు. 'అందరికి నూతన సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. కొత్త ఏడాదిలో అంతా మారిపోతుందని ఉత్సాహపడకండి. మారేది కేవలం క్యాలెండర్‌ మాత్రమే.
మీ భాగస్వామి, ఉద్యోగం, లక్ష్యాలు ఏమీ మారవు. ఇది గుర్తుచేస్తున్నా' అంటూ హర్భజన్‌ ట్వీట్ చేశారు.