Gaddalakonda Ganesh Success Meet

  • 5 years ago
Varun Tej's Gaddalakonda Ganesh (Gaddala Konda/Valmiki) continued to make a good collection at the worldwide box office.
#GaddalaKondaGanesh
#GaddalaKondaGaneshCollections
#ValmikiColelctions
#valmiki
#varuntej
#poojahedge
#harishshankar
#pawankalyan
#gabbarsingh

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో విడుదలైన వాల్మీకి (గద్దల కొండ గణేష్) హిట్ దిశగా పరుగులు పెడుతున్నది. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్‌తోపాటు చిత్ర యూనిట్ అంతా ఆంధ్రాలో విజయయాత్రను నిర్వహిస్తున్నది. ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుండటంతో వాల్మీకి యూనిట్ మరింత ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో ఈ చిత్రం గత ఆరు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..తెలుగు రాష్ట్రాల్లో వాల్మీకి చిత్రం మంచి వసూళ్లను సాధిస్తున్నది. నైజాంలో ఈ చిత్రం ఆరో రోజున 38 లక్షల రూపాయలను వసూలు చేసింది. సీడెడ్‌లో రూ.18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.8.4 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.6.2 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.4.9 లక్షలు, గుంటూరులో రూ.4.51 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.3.8 లక్షలు, నెల్లూరులో రూ.3.75 లక్షలు రాబట్టింది. దాంతో ఆరో రోజున బాక్సాఫీస్ ఖాతాలో రూ.88 లక్షలు జమ చేసింది.

Recommended