KCR Announces Dussehra Bonus To Singareni Workers || సింగరేణి కార్మికులకు లాభాల్లో 28 శాతం వాటా!!

  • 5 years ago
The Telangana government on Thursday announced a 28 per cent share in the profit of Singareni Collieries Company Limited (SCCL) to its employees for 2018-19. Chief Minister K. Chandrasekhar Rao announced in the state legislative Assembly that each employee will get a bonus of Rs 1,00,899, which is Rs 40,530 more than the last year's bonus.
#CMkcr
#Singareniemployees
#DussehraBonus
#SCCL
#trs
#Telangana
#coalbeltarea
#Assembly

సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. బొగ్గు వెలికితీసేందుకు ప్రతి నిత్యం వారు మృత్యు ఒడిలోకి వెళ్లి తిరిగొస్తున్నారని పేర్కొన్నారు. వీరి పని సరిహద్దులో గస్తీ కాసే సైనికులకు ఏ మాత్రం తీసిపొదన్నారు. బొగ్గు ఉత్పత్తిలో వారి శ్రమ అనిర్వచనీయమని కొనియాడారు. ఎప్పటిలాగే వారికి ఇచ్చే బోనస్ మరో ఒక్క శాతం పెంచుతున్నామని ప్రకటించారు. ఈ ఏడాది ప్రతి కార్మికుడికి 28 శాతం బోనస్ అందజేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం కేసీఆర్.సింగరేణి కార్మికుల సేవలను ప్రశంసించారు సీఎం కేసీఆర్. వారి అద్భుతమైన పనితీరుతో సంస్థ లాభాల్లో కొనసాగుతుందన్నారు. ప్రతీ కార్మికుడు బాధ్యతతో పనిచేస్తూ .. సంస్థను లాభాల బాట పటిస్తున్నారన్నారు. ప్రతీ ఏటా బొగ్గు ఉత్పత్తి పెరగడమే ఇందుకు నిదర్శమని కీర్తించారు. ఈ ఏడాది కూడా లాభాలు పెరిగాయాని గుర్తుచేశారు. సంస్థ లాభాల్లో ప్రతీ కార్మికుడికి 28 శాతం బోనస్ అందజేస్తామని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా కార్మికులకు ఈ మొత్తం అందజేస్తామని తెలిపారు.

Recommended