Nagarjuna's 60th Birthday Celebrations In Spain || Filmibeat Telugu
  • 5 years ago
Nagarjuna's 60th birthday in Spain: Samantha Akkineni, Naga Chaitanya and Akhil head for an exotic getaway.Naga Chaitanya and Samantha Akkineni with Akhil Akkineni are throwing him a week long party for the milestone birthday at the Ibiza Island in Spain.
#AkkineniNagarjuna
#HBDKingNagarjuna
#HBDTrendSetterNag
#NagarjunaBirthday
#samanthaakkineni
#amala
#nagachaitanya
#akhilakkineni

తెలుగు తెర మన్మథుడు అక్కినేని నాగార్జున గురువారం 60వ పడిలో అడుగుపెడుతున్నారు. ఈ పుట్టినరోజును కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య స్పెయిన్‌లో జరుపుకోనున్నారు. శ్రీమతి అమలతో కలిసి బుధవారం ఉదయం ఆయన స్పెయిన్‌ వెళ్లారు. నాగార్జున కంటే ముందు ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్‌, కోడలు సమంత, మరికొంతమంది అక్కడికి వెళ్లారు. పుట్టినరోజు కోసం సమంత ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని వినికిడి. సుమారు వారం రోజులు స్పెయిన్‌లో విహరించిన తర్వాత, సెప్టెంబర్‌ 6న నాగార్జున దంపతులు ఇండియాకు తిరిగొస్తారని సమాచారం. ఈ ఏడాది ఆయన నటించిన ‘మన్మథుడు 2’ విడుదలైంది. ప్రత్యేక పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ వచ్చే ఏడాది విడుదల కానుంది.
Recommended