IND V WI 2019,3rd T20I: Rishabh Pant Breaks MS Dhoni's India Record during Guyana T20I
  • 5 years ago
IND V WI 2019:Rishabh Pant hit a match-winning 65 from just 42 balls as India beat West Indies by 7 wickets in the 3rd T20I. Pant stitched a 106-run stand with captain Virat Kohli as India gunned down a 147-run total with relative ease.
#indvwi2019
#3rdT20I
#rishabpanth
#viratkohli
#deepakchahar
#msdhoni
#klrahul
#cricket
#teamindia

గుయానా వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ 4 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 65 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డుని బద్దలు కొట్టాడు. 2017లో బెంగళూరు వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని 56 పరుగులు చేశాడు.
ఇప్పుడు ధోని రికార్డుని రిషబ్ పంత్ అధిగమించాడు. ఇక, సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ధోని చేసిన 52 పరుగులు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉంది.
Recommended