Virat Kohli Powerless In Coach Selection Process This Time ! || Oneindia Telugu
  • 5 years ago
Team India West Indies Tour 2019:Current India coach Ravi Shastri who remains a strong contender to get the job again would never have qualified if the 'prior coaching experience' norms were adhered to when he was named Team Director in 2014.
#viratkohli
#teamindiawestindiestour2019
#ravishastri
#HeadCoach
#bcci

రవిశాస్త్రి కోచ్‌ పదవీకాలం ముగియడంతో బీసీసీఐ మళ్లీ కోచ్ పదవి కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ.. ఈసారి కోచ్ ఎంపిక కోహ్లీ మద్దతుపై ఆధారపడి ఉండదని తెలుస్తోంది. వరల్డ్‌కప్‌‌లో ఓటమి తర్వాత భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించి.. ఓపెనర్ రోహిత్ శర్మకి పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్న విషయం తెలిసిందే. భారత్ జట్టు హెడ్‌ కోచ్ ఎంపికలో కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్ర ఇకపై ఏమాత్రం ఉండబోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు స్పష్టం చేశారు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీతో భేదాభిప్రాయాల కారణంగా కోచ్‌ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేయగా.. అనంతరం కోచ్‌ ఎంపికలో విరాట్ కోహ్లీ‌నే కీలక పాత్ర పోషించాడు.
Recommended