Search
Library
Log in
Watch fullscreen
2 years ago|328 views

కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నావా జగన్...!!?? | Devineni Uma Comments On Jagan || Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
Devineni Uma Controversial Statements On AP CM YS Jagan Over His Politics and slams him for not speaking about AP.Devineni Uma Sensational Comments On AP CM YS Jagan In Press Meet and demanded to answer for the farmers and also for not speaking about the construction works which are going on in the state
#DevineniUma
#KCR
#Jagan
#ycp
#tdp
#farmers

హైదరాబాద్‌లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై ఈ సమావేశంలో జగన్‌ ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు. గత నాలుగేళ్లలో 263 టీఎంసీల నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణాకు మళ్లించినట్లు తెలిపారు. బహుదా-వంశధార-నాగావళి లింక్‌ పనులను ఎందుకు ఆపారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపై జగన్‌కు ఎందుకంత కోపమని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులను ఎందుకు నిలుపుదల చేశారో తెలపాలని డిమాండ్‌ చేశారు. ఇరిగేషన్‌ విషయంలో జగన్‌ మౌనం.. రాష్ట్ర రైతాంగానికి మంచిది కాదని హితవు పలికారు. గోదావరి-పెన్నా అనుసంధానం పనులను ఎందుకు ఆపారన్న ఉమా.. కృష్ణానది వరదను ఒడిసిపట్టే వైకుంఠాపురం బ్యారేజి పనులను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు.
Browse more videos