ICC World Cup 2019: Michael Clarke Picks This Indian Cricketer As The Best Fielder In The World

  • 5 years ago
ICC World Cup 2019:Fielding is not about how well you grab the ball, it's all about how quick you judge the ball and hit the target. In modern day cricket fielding plays a crucial role in winning the match. Every side gets balance if and only if their side is precisely quick in fielding. In between, the former Australian cricketer, Michael Clarke, who is arguably one of the best fielders in the world picked the current best fielder in the world.
#iccworldcup2019
#ravindrajadeja
#michaelclarke
#viratkohli
#msdhoni
#yuzvendrachahal
#kuldeepyadav
#cricket
#teamindia

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైకేల్‌ క్లార్క్‌ టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఎవరెన్ని అద్భుత క్యాచ్‌లు పట్టినా.. ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్‌ మాత్రం జడేజానే అని కొనియాడాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఫీల్డర్లు మెరిశారు. ముఖ్యంగా మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌, ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు.
అయితే ప్రస్తుతం ఉన్న ఫీల్డర్లలో రవీంద్ర జడేజా ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్‌ అంటూ ప్రపంచకప్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్లార్క్‌ పేర్కొన్నాడు. 'ప్రస్తుత క్రికెట్‌లో జడేజాను మించిన ఫీల్డర్‌ లేడు. ఫీల్డ్‌లో పరుగులను అడ్డుకోవడం, కష్టమైన క్యాచ్‌లు అందుకోవడం, బంతిని నేరుగా వికెట్లకు కొట్టడంలో జడేజా అద్భుతం' అని క్లార్క్‌ కితాబిచ్చాడు.
ప్రపంచ కప్‌ ప్రారంభానికి ముందు జరిగిన రెండు వార్మప్‌ మ్యాచుల్లోనూ జడేజా అద్భుతంగా ఆడాడు. కివీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్‌ అందరూ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరినా.. జడేజా అర్ధ సెంచరీ చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వార్మప్‌ మ్యాచ్‌లోనూ జడేజా రాణించాడు.
రెండు వార్మప్‌ మ్యాచుల్లోనూ రాణించినా.. జడేజాకు తుది జట్టులో చోటు దక్కడం చాలా కష్టం. ఇద్దరు స్టార్ స్పిన్నర్లు చహల్‌, కుల్దీప్‌లు జట్టులో ఉండటంతో జడేజా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ లోతైన బ్యాటింగ్ లైనప్ కోరుకుంటే.. జడేజా జట్టులో ఉంటాడు. జూన్ 5న దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది.

Recommended