ICC World Cup 2019: Imran Tahir 1st ever spinner to bowl 1st over of a World Cup
  • 5 years ago
ICC World Cup 2019:South Africa leg-spinner Imran Tahir ran off for his trademark celebration after he bowled England opener Jonny Bairstow in the opening match of World Cup 2019 at The Oval in London on Thursday. He is now the 1st spinner in World Cup history to bowl the 1st over.
#engvsa
#iccworldcup2019
#imrantahir
#jonnybairstow
#joeroot
#cricket

ప్రపంచ క్రికెట్‌ అభిమానులందరూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచకప్‌ 2019 సరికొత్త రికార్డుతో ప్రారంభమైంది. గురువారం ఆతిథ్య ఇంగ్లండ్‌- దక్షిణాఫ్రికా మధ్య ఓవల్‌ మైదానంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా వెటరన్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు.
ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ స్పిన్నర్‌ వేయడంతో ఇమ్రాన్‌ కొత్త రికార్డు నెలకొల్పాడు. దీంతో 1975 నుంచి 2015 వరకు అన్ని ప్రపంచకప్‌లలో ఏ స్పిన్‌ బౌలర్‌కు దక్కని అరుదైన అవకాశం తాహిర్‌కు దక్కింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. తొలి ఓవర్‌ వేసేందుకు స్పిన్నర్ ఇమ్రాన్‌ తాహిర్‌కు డుప్లెసిస్‌ బంతి ఇచ్చాడు. దీంతో 11 ప్రపంచకప్‌ల నుంచి వస్తున్న ఆనవాయితీని డుప్లెసిస్‌ తెరదించి స్పిన్నర్‌తో తొలి ఓవర్‌ వేయించాడు.
తాహిర్‌ కెప్టెన్‌ నమ్మకాన్ని నిజం చేస్తూ తొలి ఓవర్‌ రెండో బంతికే ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో (0)ని పెవిలియన్ చేర్చాడు. ఇనింగ్స్ ఆరంభంలో మంచి ఓవర్ వేసిన తాహిర్‌.. అనంతరం తడబడ్డాడు. తన కోటా 10 ఓవర్లలో ఏకంగా 61 పరుగులు ఇచ్చి కేవలం 2 వికెట్లు మాత్రమే తీసాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో కూడా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున తాహిర్‌ తొలి ఓవర్‌ వేసాడు. అక్కడ సఫలం అవ్వడంతో.. డుప్లెసిస్‌ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.
1975 తొలి ప్రపంచకప్‌లో టీమిండియా పేస్‌ బౌలర్‌ మదన్‌లాల్‌ తొలి ఓవర్‌ వేసి చరిత్రలో నిలిచిపోయాడు. వెస్టిండీస్‌ బౌలర్‌ రాబర్ట్స్‌ (1979లో), న్యూజిలాండ్‌ బౌలర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ (1983), శ్రీలంక బౌలర్‌ వినోథెన్‌ (1987), ఆసీస్‌ బౌలర్‌ డెర్‌మాట్‌ (1992), ఇంగ్లండ్‌ బౌలర్లు కార్క్‌(1996), గాఫ్‌(1999).. ప్రొటీస్‌ బౌలర్‌ పొలాక్‌ (2003), పాక్‌ బౌలర్‌ ఉమర్‌ గుల్‌ (2007), బంగ్లా బౌలర్‌ ఇస్లాం (2011), లంక బౌలర్‌ నువాన్ కులశేఖర్‌ (2015)లు ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్‌లలో తొలి ఓవర్‌ వేశారు. వీరందరూ పేస్‌ బౌలర్లు కాగా.. ప్రపంచకప్‌-2019లో స్పిన్నర్‌ తొలి ఓవర్‌ వేసాడు.
Recommended