IPL 2019 : Pant Scored 78 Off 27 Deliveries To power Delhi To 213/6 In 20 Overs

  • 5 years ago
Man of the Match Pant finished with 78 off just 27 bolls even as the wickets kept falling around him to take Delhi to a dominant total of 213/6. He hit seven fours and seven sixes during his stunning innings even taking Jasprit Bumrah to the cleaners in the last overs.

#ipl2019
#delhicapitals
#mumbaiindians
#rishabhpant
#rohithsharma
#shreyasiyer
#ipl
#catch
#shikardhavan
#Prithvi Shaw

రిషబ్ పంత్... ఈ యంగ్ సెన్సేషనల్ మరోసారి సునామీ క్రియేట్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లను ఊచకోత కోసం ఐపీఎల్‌లో రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ క్రియేట్ చేశాడు. పంత్ పరుగుల సునామీ కారణంగా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నాడంటే మనోడి దాడి ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. 150 కూడా దాటుతుందో లేదో అనుకున్న ఢిల్లీ జట్టు... 6 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు రెండో ఓవర్‌లోనే పృథ్వీషా వికెట్ కోల్పోయింది. ఆరు బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన పృథ్వీషా... మెక్‌క్లెన్ బౌలింగ్‌లో డి కాక్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 16 పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా మెక్‌క్లెన్ బౌలింగ్‌లనే అవుట్ అయ్యాడు. 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఢిల్లీ జట్టు. ఈ దశలో కోలిన్ ఇన్‌గ్రామ్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు శిఖర్ ధావన్. వీరిద్దరూ నిలకడగా బ్యాటింగ్ చేయడంతో 12.5 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది ఢిల్లీ. ఈ దశలో భారీ షాట్‌కు ప్రయత్నించిన ఇన్‌గ్రామ్‌, కట్టింగ్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 32 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేశాడు ఇన్‌గ్రామ్.

Recommended