ఛీ.. దీన‌మ్మా జీవితం..! 3 నెల‌ల‌వుతున్నా జీతానికి దిక్కులేదు..!! | Oneindia Telugu
  • 5 years ago
Jet Airways has been experiencing crisis for some days. This impact also hit the company's employees. Naresh Goel, chairman of the company, is also ready to withdraw from his tenure. However, the company is struggling to provide salaries to employees for three months.
#employees
#engineers
#jetairways
#nareshgoel
#chairman
#salaries
#threemonths
#India
#dgca


పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదేనేమో..! చెప్పుకోవ‌డానికి చేసే కొలువు ఎంత గొప్ప‌దైనా ఏం లాభం..? జీతాలు స‌రిగా ఇవ్వ‌న‌ప్పుడు స్క్రాబ్ దుకాణ‌మైనా, అంత‌ర్జాతీయ సంస్థ ఐనా ఒక‌టే..! జెట్ ఎయిర్‌వేస్‌ కొన్ని రోజులుగా సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం ఆ సంస్థ ఉద్యోగులను కూడా తాకింది. తాజాగా ఈ సంస్థ ఛైర్మన్‌ నరేష్ గోయెల్ సైతం తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.అయితే కొంత కాలంగా ఉద్యోగులకు వేతనాలు అందివ్వడంలో కూడా ఈ సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంోంది. దీంతో జెట్‌ పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్(డీజీసీఏ)కు ఎయిర్‌వేస్‌ ఇంజినీర్ల సంక్షేమ సంఘ ప్రతినిధులు లేఖ రాశారు. 'ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ప్రభావం మేం చేసే పనిమీద కూడా పడుతోంది. జెట్‌ ఎయిర్‌వేస్‌లో పనిచేసే ప్రతి ఇంజినీరు పరిస్థితి ఇలాగే ఉందని ఆ లేఖ‌లో ద‌య‌నీయంగా పేర్కొన్నారు.