Rahul Gandhi Was Once Again Accused On BJP | Oneindia Telugu
  • 5 years ago
Congress Party national president Rahul Gandhi was once again accused on BJP. The BJP did not know how to make the country better than spreading hatred, he said. Rahul told that, Congress will defeat the BJP in the next Lok Sabha elections. Speaking as part of the party program, Rahul broke into the BJP.
#RahulGandhi
#PMNarendramodi
#BJP
#LokSabhaelections
#CongressParty
#priyankagandhi

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. బీజేపీపై మరోసారి ఆరోపణాస్త్రాలు సంధించారు. ద్వేషాన్ని వ్యాప్తి చేయడం తప్ప దేశాన్ని ఎలా బాగుచేయాలో బీజేపీకి తెలియదని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఓడించడం ఖాయమన్నారు. పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రసంగించిన రాహుల్.. బీజేపీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయం.. ప్రధాని నరేంద్ర మోడీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు రాహుల్. విభజించి పరిపాలించాలనుకునే ప్లాన్ వర్కవుట్ కావడం లేదనే విషయం.. మోడీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దేశ భద్రత అంశంపై తనతో మాట్లాడే ధైర్యం మోడీకి లేదన్నారు రాహుల్. గత ఐదేళ్లుగా ఆయనపై పోరాటం చేస్తుండటంతో మోడీ గురించి చాలా విషయాలు అర్థమయ్యాయని తెలిపారు. మోడీతో వాదించడానికి ఎవరైనా సిద్ధమైతే.. ఆయన వెనుదిరిగి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు.
Recommended