Telangana Elections 2018 : Survey Reports తెరాస వైపు మొగ్గు చూపిన పలు సర్వేలు | Oneindia Telugu

  • 5 years ago
Times Now opinion poll has predicted that the Telangana Rashtra Samithi (TRS) will return to power for a second term in the state, in the upcoming Legislative Assembly elections scheduled for December 7.
#Telanganaassemblyelections2018
#KCR
#trs
#mahakutami
#IndiaTodaysurvey


తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు మరో పన్నెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి గెలుపుపై ధీమాగా ఉన్నాయి. తమకు 70 నుంచి 80 స్థానాలు వస్తాయని కాంగ్రెస్ చెబితే, 100కు పైగా స్థానాలు వస్తాయని తెరాస చెబుతోంది. ఈ నేపథ్యంలో పలు జాతీయ ఛానళ్లు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాంలతో పాటు తెలంగాణలోను సర్వేలు నిర్వహించాయి. ఎక్కువ సర్వేల్లో తెరాస అధికారంలోకి వస్తోందని వెల్లడైంది. ఒకటి రెండు సర్వేలు మాత్రం మహాకూటమి గెలుస్తుందని చెప్పాయి. అయితే ఇటీవల విడుదలైన సర్వేలు తెరాస వైపు మొగ్గు చూపాయి.

Recommended