ICC Women's T20 World Cup, IND VS PAK : India Thrash Pak by 7 Wickets | Oneindia Telugu

  • 6 years ago
India completed a 7-wicket victory over Pak in the Group B of the ICC World T20 on Sunday. India’s fine display in the tournament continued as they registered their second win in as many games and moved a step closer to a semi-final berth.
#Indiavspak
#ICCWomensWorldCupT20
#HarmanpreetKaur
#IndiaThrashPakistan
#MithaliRaj

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించింది భారత్ . ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత అమ్మాయిలు అలవోకగా ఓడించారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులే చేసింది. న్యూజిలాండ్‌పై అద్భుత విజయంతో మెగా టోర్నీని ఆరంభించిన టీమ్‌ఇండియా.. పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఆదివారం (నవంబరు 11) జరిగిన గ్రూపు-బి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్ సేన 7 వికెట్ల తేడాతో పాక్‌పై ఘనవిజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 134 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో ఓవర్ మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. పాక్‌కు పది పరుగుల పెనాల్టీ పడటంతో లక్ష్యం మరింత చిన్నదిగా మారింది.

Category

🥇
Sports

Recommended