Womens Cricket 2018 : Indian Women Cricket Team Won The Series Aganist Srilanka
  • 6 years ago
Anuja Patil and Jemimah Rodrigues smashed unbeaten half centuries, taking Indian women to a series-sealing win over hosts Sri Lanka in a rain affected fourth T20 International here on Monday.
#india
#srilanka
#womencricket
#t20series

శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను భారత మహిళల జట్టు ఇంకా ఒక మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన నాలుగో టీ20లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్‌ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది.
వర్షం కారణంగా మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు శ్రీలంకను బ్యాటింగ్‌ను ఆహ్వానించింది. దీంతో ఆతిథ్య శ్రీలంక జట్టు నిర్ణీత 17 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. అనంతరం 135 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
భారత ఓపెనర్లు మిథాలీ రాజ్‌(11), స్మృతీ మంధాన(5)లు విఫలమైనప్పటికీ, జెమిమా రోడ్రిగ్స్‌(52 నాటౌట్‌; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అనుజా పాటిల్‌(54 నాటౌట్‌; 42 బంతుల్లో 7ఫోర్లు) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌ని రోడ్రిగ్స్‌ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ముగించడం విశేషం.
వీరిద్దరి జోడి అజేయంగా 96 పరుగులు జోడించడంతో భారత్‌ 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. దీంతో సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. రెండో టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో చివరిదైన ఐదో టీ20 ఇరు జట్ల మధ్య మంగళవారం జరుగనుంది.
Recommended