Gold Sales Down Despite Rates Falling మసకబారుతోన్న ‘పసిడి’..
  • 6 years ago
Gold prices recovered by Rs 25 to Rs 30,825 per 10 grams on Thursday on scattered buying by local jewellers despite weak global cues, reported PTI. In global markets, gold prices extended fall to a one-year low as the US dollar firmed after US Federal Reserve chairman Jerome Powell asserted the need for further interest rate hikes amid a strong economy. In Delhi, gold rates of 99.9% and 99.5% purity edged up by Rs 25 each to Rs 30,825 and Rs 30,675 per 10 grams, respectively. The yellow metal had lost Rs 350 in the last two days.
#Gold
#Price
#Decrease
#Production
#10GramsGold
#Jewellery
#Dollar

ప్రతి ఏడాది శ్రావణ మాసంలో బంగారం అమ్మకాలు గణనీయంగా ఊపందుకునేవనీ.. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి లేదని బంగారు ఆభరణాల తయారీదారులు వాపోతున్నారు. కొన్ని నెలలుగా క్రమంగా బంగారం ధర తగ్గుతున్నా.. ప్రస్తుతం అమ్మకాలు పుంజుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వారు పేర్కొంటున్నారు. రూపాయి విలువ పతనం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన విధంగా దేశంలో ధరలు తగ్గకపోయినా గడచిన ఆరు నెలల్లో విజయవాడలో పది గ్రాముల బంగారం ధర రూ.2,325 వరకు తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నమోదైన రూ.32,825 గరిష్ట స్థాయి నుంచి బంగారం ధర ఆగస్టు 20 నాటికి రూ.30,500 తగ్గింది. ఇదే సమయంలో ఆభరణాల బంగారం ధర (22 క్యారెట్లు) రూ.29,250 నుంచి రూ.1,140 తగ్గి రూ.28,110 చేరుకుంది. అదే అంతర్జాతీయ మార్కెట్లో ఏప్రిల్‌ 11న 159 డాలర్లుగా ఉన్న ఔన్స్‌ బంగారం ధర గత నాలుగు నెలల్లో పతనమవుతూ రూ.1,188 వద్ద ట్రేడ్‌ అవుతోంది.