Fans Wants These Golden Biopics in Tollywood ఈ బయోపిక్స్‌ వస్తాయా...!!
  • 6 years ago
Biopics like ‘Gautamiputra Satakarni’ and ‘Rudhramadevi’ have been well-received by the audience and have done well at the box office too. With such tremendous response and love, Tollywood filmmakers are keen on making more biopics to prove their mettle and the coming season is perfect to watch the life stories of eminent personalities on the big screen.
#Biopic
#KVReddy
#ChittoorNagayya
#Mahanati
#Savitri
#Suryakantham
#NTR
#ANR


భారతీయ సినిమాకు ఆద్యుడైన ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ 1913లో మొదటి ఫీచర్‌ ఫిల్మ్‌గా ‘రాజా హరిశ్చంద్ర’ను తెరకెక్కించాడు. హరిశ్చంద్రుడు నిజ జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఈ సినిమా తీయడానికి దాదా సాహెబ్‌ ఫాల్కే కూడా అన్ని కష్టాలు పడ్డాడు. ఆయన ‘రాజా హరిశ్చంద్ర’ను తీయడం వెనుక పడిన కష్టాన్ని, తపనని, జీవితాన్ని ఆధారం చేసుకొని మరాఠీలో ‘హరిశ్చంద్రచి ఫ్యాక్టరీ’ అనే సినిమా తీశారు 2010లో. మనకు సినిమా ఇచ్చిన మహనీయునికి సినిమా ద్వారా ప్రకటించగలిగిన నివాళి అది. కాని తెలుగులో అలాంటి నివాళి మరో ఎనిమిదేళ్లు గడిస్తే తప్ప రాలేదు. సావిత్రి పై తెరకెక్కించిన ‘మహానటి’ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తొలి బయోపిక్‌. అయితే సావిత్రి గురించి మాత్రమే బయోపిక్‌ తీస్తే సరిపోతుందా? నిజానికి మన ఇండస్ట్రీ ఎందరి బయోపిక్‌లకో బాకీ పడి ఉంది. అవన్నీ నిజరూపు దాలిస్తే తెలుగు ప్రేక్షకులకు మించి ఆనందపడేవారు మరొకరు ఉండరు. బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో అసలు ఎందరి బయోపిక్‌లు ఇంకా తీయవలసి ఉందో ఒకసారి చూద్దాం. వీళ్ల జీవితం వెండితెర మీద ఎందుకు ఆసక్తికరమో కూడా పరిశీలిద్దాం.