సుష్మా కౌంటర్ పై స్పందిస్తున్న నెటిజన్‌లు

  • 6 years ago
External Affairs Minister Sushma Swaraj, known for keeping in touch with people over Twitter, had everyone in splits when she said she will need to consult a volcano in Indonesia in response to an Indian's query asking if the government has any advisory for tourists visiting the Southeast Asian nation.
#sushmaswaraj
#volcano
#indonesia
#Twitter
#India
#Funny


కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎవరైనా తమకు సమస్య ఉందంటే వెంటనే స్పందిస్తారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. అయితే అప్పుడప్పుడు కొందరు విచిత్రమైన ప్రశ్నలు సంధిస్తారు. చిత్రమైన బాధలు ఆమె ముందు పెడతారు. ఆమె కూడా స్పాంటేనియస్‌గా అందుకు తగినట్లుగా స్పందిస్తారు. కొన్నిసార్లు మంచి కౌంటర్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా, అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. తాను ఓ దేశం వెళ్లాలనుకుంటున్నానని, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయని, భద్రమేనా అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దానికి సుష్మా స్వరాజ్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఆమె సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది.

Recommended