నిరుద్యోగ భృతి పై చంద్ర బాబు నాయుడు స్పందన
  • 6 years ago
Andhra Pradesh cabinet on Thursday approved Rs 1,000 unemployment allowance to youth on Thursday.YSR Congress party leader Botsa Satyanarayana on Thursday alleged that Chief Minister Chandrababu Naidu political life is with full of U turns.
#AndhraPradesh
#Thursday
#BotsaSatyanarayana
#ChandrababuNaidu

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశం పార్టీ ఓ ఆయుధం ఇచ్చిందా? అంటే అవుననే అంటున్నారు. నిరుద్యోగ భృతితో యువతను ఆకట్టుకునే ప్రయత్నం టీడీపీ ప్రభుత్వం చేస్తోంది. కానీ దీనిపై ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించి, అధికార పార్టీని కార్నర్ చేసే ప్రయత్నాలు చేసే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు.
తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు రూ.2వేలు ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. కానీ నాలుగేళ్ల పాటు దీనిపై కదలిక లేదనేది విపక్షాల వాదన. ఇప్పుడు హఠాత్తుగా నిరుద్యోగ భృతిని తెరపైకి తీసుకు రావడానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందుకు ముఖ్యంగా జనసేన అధినేత పవన్.
ఇటీవలి వరకు పవన్‌ను తెలుగుదేశం పార్టీ మిత్రుడిగానే చూసింది. కానీ 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. అంతేకాదు, తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. పవన్‌కు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ఆయన మాట్లాడుతూ... యువత అంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పిలుపు కూడా ఇచ్చారు. పవన్ వైపు యువత మొగ్గు చూపుతుందనే ఉద్దేశ్యంతోనే ఇన్నాళ్లకు నిరుద్యోగ భృతిని తెరపైకి తెచ్చారని గతంలోనే భావించారు. ఇదే అభిప్రాయం పవన్ కూడా వ్యక్తం చేశారు.
Recommended