క్రేన్ కుప్పకూలిన ఘటనలో ఆరు మంది దుర్మరణం

  • 6 years ago
సిమెంట్ ఫ్యాక్టరీలో క్రేన్ కుప్పకూలి పోవడంతో ఆరు మంది దుర్మరణం చెంది అనేక మందికి తీవ్రగాయాలు అయిన ఘటన కర్ణాటకలోని బీదర్ సమీపంలో జరిగింది. సేడం తాలుకా కోడ్లాలోని శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి కోడ్లాలోని శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులు వారి పనుల్లో వారు నిమగ్నం అయ్యారు. ఆ సమయంలో కొందరు కార్మికులు వెల్డింగ్ పనులు చేస్తున్నారు. అదే సమయంలో విపరీతమైన వర్షం, భారీగా గాలులు రావడంతో క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
#karnataka
#workers
#crane
#sricementfactory
#case