Today's News టుడే న్యూస్ అప్డేట్

  • 6 years ago
Uyyalavada Narasimha Reddy, who has fight with British Army in the backdrop of Indian freedom fight...now his life is going to be a movie with Megastar Chiranjeevi as Hero. But this movie surrounds another controversy.
#andhrapradesh
#hyderabad
#fight
#megastarchiranjeevi
#TodaysNewsUpdate


1. బ్రిటీష్ సైన్యాన్ని గడగడలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం సైరా పేరుతో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని మరో వివాదం చుట్టుముట్టింది. తమ వంశానికి పేరు తెచ్చిపెట్టిన పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని తెరకెక్కిస్తూ తమను కనీసం గుర్తించకపోవడం...సంప్రదించకపోవడం అన్యాయమని ఉయ్యాలవాడ వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మాట్లాడేందుకు ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చినా...ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కూడా తమను ఏమాత్రం పట్టించుకోకపోవడం సరికాదని వారు వాపోతున్నారు
2. అదే దోపిడీ... అదే లూటీ... ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ ధరకు తినుబండారాలు, కూల్ డ్రింక్స్ అమ్మకూడదన్న ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ యథావిధిగా దోచుకుంటున్నాయి పలు మల్టీప్లెక్సులు, బడా థియేటర్లు. ఆగష్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలను బేఖాతరు చేశాయి ఆయా థియేటర్ యాజమాన్యాలు. ఇదిలా ఉంటే అధిక ధరలపై ఫిర్యాదు చేయాలంటే టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్స్ యాప్ నంబరు 7330774444ను సంప్రదించాలని తూనికలు, కొలతల శాఖ ప్రకటించింది.

Recommended