వెరీ డెంజరస్: కెనడా టు రెజినా: ఏమిటీ కికి ఛాలెంజ్
  • 6 years ago
Jumping out of a moving vehicle and dancing in the road doesn't sound like a great idea. But for the thousands of people around the world dancing to Drake's In My Feelings song, it's just another craze to be a part of.
కొద్ది రోజులుగా కికి ఛాలంజ్ పేరు బాగా వినిపిస్తోంది. అన్నింటా దూకుడుగా ఉండే యువత దీని పట్ల ఎంతో క్రేజ్‌తో ఉన్నారు. కికి ఛాలెంజ్‌పై చాలామంది ఆసక్తితో ఉన్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరం కాబట్టి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరైనా కికి ఛాలెంజ్ నిర్వహించినా, విసిరినా కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు.
కికి ఛాలెంజ్ సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీంతో ఢిల్లీ, పంజాబ్, హర్యాన్, యూపీ, ముంబై రాష్ట్రాలలోని యువత రాత్రి సమయాల్లో రోడ్ల పైకి వచ్చి కికి ఛాలెంజ్ చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే నిర్మానుష్య రోడ్లపైకి వెళ్లి దీనిని చేస్తున్నట్లు గుర్తించి సీరియస్ అయ్యారు.
కొద్ది రోజులుగా వినిపిస్తున్న కికి ఛాలెంజ్ అంటే యువతకు చాలామందికి తెలిసింది. అసలు కికి ఛాలెంజ్ అంటే ఏమిటనే ఆసక్తి ఉండవచ్చు. నడుస్తున్న కారులో నుంచి కిందకు దిగి కాసేపు పాటపాడి, దానికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ అదే వేగంలో ఉన్న కారులోకి ఎక్కడమే కికి ఛాలెంజ్. ఆ సమయంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి వీడియో తీస్తాడు. దానిని పోస్ట్ చేస్తారు. ఇది ప్రమాదకరమైనది. అందుకే పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Recommended