Sreesanth Flaunts Absolutely Amazing Body

  • 6 years ago
ఒకప్పుడు భారత్ జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగిన కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్ కుంభకోణంలో అతడు జైలుకు కూడా వెళ్లివచ్చాడు. అప్పటి నుంచి అతడు క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ అనుమతించట్లేదు. ఈ నేపథ్యంలో అతడు సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు.శ్రీశాంత్ జిమ్‌లో సాధన చేస్తుండగా తీసిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ప్రతి వారం పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. అతని కసరత్తులు, జిమ్ బాడీని చూసి నెటిజన్లు స్టన్ అవుతున్నారు. తాజాగా మరో వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న బాలీవుడ్ సినిమా కోసం శ్రీశాంత్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పాత్రకు అనుగుణంగా ఫిట్‌గా తయారవుతున్నాడు.

People were stunned when former India cricketer S Sreesanth's pictures surfaced on social media recently. Sreesanth was seen sporting a well-chiselled body. His physical transformation and new look made headlines after some pictures were shared on the social media.
#sreesanth
#cricket
#india
#Bollywood

Recommended