ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి: ఐసీసీ

  • 6 years ago
క్రికెట్లో అవినీతికి వ్యతిరేకంగా వస్తున్న స్పందన పట్ల ఐసీసీ హర్షం వ్యక్తం చేస్తుంది. ఫిక్సింగ్‌కు పాల్పడమని తమను కొందరు సంప్రదించారని అవినీతి నిరోధక విభాగానికి ఫిర్యాదు చేశారని వెల్లడించింది. ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్‌ (ఏసీయూ)ను ఏడాదిలో నలుగురు అంతర్జాతీయ కెప్టెన్లు సంప్రదించారు. ఈ మేరకు అవినీతికి సంబంధించి 2017-18లో మొత్తం కేసులను ఏసీయూ విచారించినట్టు వెల్లడించింది.క్రికెట్లో అవినీతిపై గత జూన్‌ 1 నుంచి ఈ ఏడాది మే 31 మధ్య కాలంలో అందిన 18 ఫిర్యాదులపై విచారణ చేపట్టామని, అందులో ఐదు ముగిశాయని గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి జనరల్ మేనేజర్‌గా అలెక్స్ మార్షల్ నియమితులైన తర్వాతి నుంచి ఇలాంటి వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ మేరకు ఫిర్యాదు చేస్తున్న ఆటగాళ్ల సంఖ్య పెరగడం శుభసూచకమని ఐసీసీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. వారిలో నలుగురు కెప్టెన్లున్నారని చెప్పింది.

Recommended