2019లో ఏపార్టీ అధికారంలోకి రావాలన్నా...మేమే కీలకం : కాంగ్రెస్

  • 6 years ago
AP Congress party affairs incharge Oommen Chandy said, "Any party will need Congress party support to come power in AP in 2019 Elections.

2019 ఎన్నికల్లో ఎపిలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాంగ్రెస్‌ మద్దతు కీలకమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ చెప్పారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన గురువారం నెల్లూరులో పర్యటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పటిష్ఠమవుతోందని అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ దగా చేసిందన్నారు. వెంకయ్యనాయుడు వల్లే రాష్ట్రానికి హోదా వస్తుందని మోదీ అప్పట్లో చెప్పారని, ఇప్పుడు వెంకయ్యనాయుడు, హోదా ఎటుపోయాయో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
అనంతరం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంపై నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి మెయ్యప్పన్‌, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
రూ.16 వేల కోట్లతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్ట్ రూ.58 వేల కోట్లకు ఎందుకు పెరిగిందో, దాని మర్మమేమిటో టీడీపీ-బీజేపీ వివరించాలని ఊమెన్ చాందీ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష వైసీపీ ప్రజా సమస్యలపై పోరాటం, ప్రత్యేక హోదా సాధనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన టీడీపీ...ఓట్లు రావనే భయంతోనే ఇప్పుడు ధర్మపోరాట దీక్షలంటూ దొంగ నాటకాలాడుతోందని ధ్వజమెత్తారు. 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రాహుల్‌గాంధీ ప్రధానిగా ప్రత్యేక హోదా ఫైలుపైనే తొలి సంతకం చేస్తారని చెప్పారు.

Recommended