నాకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడు: జేసీ సంచలనం

  • 6 years ago
అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కావడం కూడా రాష్ట్రానికి శాపమైందని ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీపై కేంద్రం వైఖరికి నిరసనగా అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో టిడిపి ఎంపీలు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీ జెసి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ అధికారంలో ఉన్నంత వరకు ఏపీకి బెల్లం ముక్క కూడా ఇవ్వరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను చంద్రబాబుకు కూడా చెప్పానని పునరుద్ఘాటించారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ప్రయత్నం చేయాలని సీఎం అన్నారని జెసి తెలిపారు.
పదవులు వస్తున్నకొద్దీ హుందాగా వ్యవహరించాలని జెసి దివాకర్ రెడ్డి మోడీకి సూచించారు. కేంద్రం హామీలు ఇచ్చి మోసం చేయడం న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. మంగళవారం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని మర్తాడు క్రాస్‌ సమీపంలో జరిగిన రైతుల సమావేశంలోనూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఆయన సొంత పార్టీ నేతలనే ఎక్కువగా టార్గెట్ చేశారు.

MP JC Diwakar Reddy had made sensational comments on vice president Venkaiah Naidu, TDP and Communists. JC Speaking on this occasion of MP's deeksha, he said that Center has done nothing for the state and it cheated.
#andhrapradesh
#ananthapur
#mpjcdiwakarreddy
#venkaiahnaidu
#tdp