మొదటికే మోసం : పవన్‌పై ఆదేశాలు జారి చేసిన టీడీపీ

  • 6 years ago
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఎదురుదాడి చేయాలని టిడిపి నిర్ణయించింది. జనసేనాని చేస్తున్న ఆరోపణలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. పవన్‌కు సరైన కౌంటర్లు ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2014లో పవన్ మద్దతిచ్చారు. ఎన్నికలకు ముందు ఆయనను టీడీపీ రాజకీయపరంగా బద్దశత్రువులా చూస్తోంది.
పవన్ తరచూ చేస్తున్న ఆరోపణలను ఇప్పటివరకూ ఆచితూచి మాత్రమే స్పందిస్తున్న టీడీపీ ఇకపై తీవ్రంగా తిప్పికొట్టనుంది. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ రెండు పార్టీలు కలిసి కట్టుగా సాగడంతో పవన్ అప్పుడప్పుడు తీవ్ర ఆరోపణలు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన విమర్శల తీవ్రత పెరగడంతో తగ్గేది లేదని నిర్ణయానికి వచ్చారు.

Telugudesam High Command ordered leaders to counter Jana Sena chief Pawan Kalyan!
#pawankalyan
#gantasrinivasrao
#andhrapradesh
#telugudesam
#janasena

Recommended