Sanju Movie Collections Crossed Bahubali Record

  • 6 years ago
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందిన సంజు చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. గత పదిరోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం రూ.250 కోట్ల మార్కును దాటి రూ.300 కోట్ల క్లబ్‌ వైపు దూసుకెళ్తున్నది. 2018 ఏడాదిలో సంజు చిత్రం పలు రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
సంజు విడుదల తర్వాత రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు బలంగా ఉన్నాయి. రెండో శుక్రవారం 12.5 కోట్లు వసూలు చేయగా, శనివారం రూ. 21.25 కొల్లగొట్టింది. అలాగే ఆదివారం రూ.28 కోట్లు వసూలు చేసి రెండో వారాంతంలో 61.75 కోట్లు కలెక్ట్ చేసింది.
సంజు విడుదలైన తొలి వారాంతంలో ఆదివారం రూ.46.71 కోట్లు వసూలు చేసింది. ఓ ఆదివారం ఈ రేంజ్‌లో వసూళ్లు రాబట్టడం బాలీవుడ్‌లోనే రికార్డు పేర్కొన్నారు. బాహుబలి2 చిత్రం 46.50 కోట్లు వసూలు చేసి అప్పట్లో ఓ రికార్డును సొంతం చేసుకొన్నది.
సంజు చిత్రం రిలీజ్ రోజున రూ.34.75 కోట్లతో 2018లో మొదటి రోజున అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది. అలాగే 2018లో వారాంతానికే రూ.119.33 కోట్లు వసూలు చేసి సినిమాగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నది.

Rajkumar Hirani’s Sanju has now crossed Rs 250 crore-mark at the box office within 10 days of the release. According to a boxofficeindia report, the Ranbir Kapoor-starrer has earned Rs 261.83 crore and is expected to Rs 300-crore club. The Ranbir Kapoor film is still going strong at the box office and has brojen as many records as it has created.
#Sanju
#RajkumarHirani

Recommended