Jurassic Park Fallen Kingdom Collects 6800 Crores
  • 6 years ago
ప్రపంచ సినీ చరిత్రలో ఓ సంచలనం జూరాసిక్ పార్క్. లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్స్ (రాకాసి బల్లులు)కు జీవం పోసి తెరపై చూపించడం సినీ అభిమానులను ఎంతగానో అబ్బురపరిచాయి. ఇప్పటి వరకు నాలుగు సిరీస్‌ మూవీస్ రాగా .... తాజాగా 5వ సరిస్ 'జూరాసిక్ వరల్డ్-ఫాలెన్‌ కింగ్‌డమ్' పేరుతో జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.
జూరాసిక్ వరల్డ్-ఫాలెన్ కింగ్‌డమ్' చిత్రం హాలీవుడ్ సినీ విమర్శకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయిందని, సినీ క్రిటిక్స్ నుండి కేవలం 63 శాతం మార్కులు మాత్రమే పడ్డాయని ప్రముఖ హాలీవుడ్ సినీ రివ్యూ అగ్రిగేటర్ వెబ్‌సైట్ రొట్టెన్ టమాటోస్ పేర్కొంది. అయితే సినిమా ఫ్రెష్‌గా ఉందనే కాంప్లిమెంట్ రావడం విశేషం.
ప్రపంచ సినిమా చరిత్రలో అద్భుత సృష్టి అని చెప్పుకోదగ్గ వాటిలో 'జూరాసిక్ పార్క్' సిరీస్ చిత్రాలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. లక్షల సంవత్సరాల క్రితం భూమిపై ఉనికిలో ఉన్న డైనోసార్స్‌ను సినిమా రూపంలో మన కళ్ల ముందుకు తెచ్చి ఆశ్చర్యపరిచారు ప్రముఖ ఫిల్మ్ మేకర్ స్టీవెన్ స్పీల్ బర్గ్. ఇప్పటికే ఈ సిరీస్‌లో వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి. ప్రస్తుతం ఉన్న 3డి టెక్నాలజీతో డైనోసార్స్ కళ్ల ముందే కదలాడిన అనుభూతిని పొందుతున్నారు ప్రేక్షకులు. ఈ సిరీస్‌లో చివరగా 2015లో 'జూరాసిక్ వరల్డ్' సినిమా వచ్చింది. దీనికి సీక్వెల్‌గా 'జూరాసిక్ వరల్డ్: పాలెన్ కింగ్‌డమ్' ఈ ఏడాది జూన్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం 1 బిలియన్‌ డాలర్లు (రూ.6800 కోట్లు) వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

The fifth film in the “Jurassic” franchise hit $1 billion at the global box office, making it the 35th movie to reach that milestone. “Fallen Kingdom” joins its predecessor, 2015’s “Jurassic World,” which ended its theatrical run with $1.7 billion. In North America, “Fallen Kingdom” has pocketed $304.8 million and $700.7 million from international territories. Universal, the studio behind the film, now has released seven billion-dollar grossing movies.
Recommended