Rajinikanth Next Movie Heroine Declared

  • 6 years ago
సూపర్ స్టార్ రజనీకాంత్ పాలిటిక్స్ తో బిజీ అయ్యేముందు వీలైనన్ని ఎక్కువ చిత్రాల్లో నటించాలని భావిస్తున్నారు. కాలా చిత్రం విడుదలైన వెంటనే రజని కొత్త చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజని ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ డార్జిలింగ్ లో జరుగుతోంది. తాజగా ఈ చిత్రానికి హీరోయిన్ గా సీనియర్ నటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సిమ్రాన్ ని ఈ చిత్రానికి హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఈ మిలీనియం ఆరంభంలో నటి సిమ్రాన్ యువతని ఒక ఊపు ఊపింది. తెలుగు తమిళ భాషల్లో పలువురు స్టార్ హీరోల సరసన సిమ్రాన్ నటించింది. చిరంజీవి, నాగార్జున, అజిత్, బాలయ్య ఇలా అందరి హీరోల సరసన సిమ్రాన్ ఆడిపాడింది.
కుర్రాళ్ళ కలల రాణిగా వెలుగు వెలిగిన సిమ్రాన్ సూపర్ స్టార్ రజని సరసన మాత్రం ఇంత వరకు నటించలేదు. కార్తీక్ సుబ్బరాజ్, రజని చిత్రంలో నటింపజేసేందుకు నిర్మాతలు ఇటీవల సిమ్రాన్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది.

Simran opposite Rajinikanth in Karthik Subbaraj's film. After Kaala Rajinikanth committed for karthik subbaraj
#Rajinikanth

Recommended