జయ మరణం: ‘అమ్మ’ డ్రైవర్‌ కీలక సమాచారం

  • 6 years ago

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత డెత్ మిస్టరీ మరో మలుపు తీసుకుంది. జయలలిత చనిపోయే వరకు ఆమె వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేసిన కన్నన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 1991 నుంచి కన్నన్ జయలలితకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 22, 2016లో జయలలిత గదిలోకి తాను వెళ్లగా అప్పటికే ఓ కుర్చీలో కూర్చొని అపస్మారక స్థితిలో ఉండటాన్ని తాను చూసినట్లు కన్నన్ తెలిపాడు. రాత్రి 10 గంటలకు జయలలిత వ్యక్తిగత భద్రతా అధికారి వీరపెరుమాల్ కారు తీసుకురావాల్సిందిగా తనను ఆదేశించాడని గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత మరో పెద్ద కారు తీసుకురావాల్సిందిగా అమ్మ దగ్గర పనిచేసే పనిమనిషి చెప్పిందన్న కన్నన్... పెద్ద కారు తెచ్చాక శశికళ పిలుస్తున్నారని చెప్పడంతో గదిలోకి వెళ్లినట్లు కన్నన్ చెప్పాడు.రెండో అంతస్తులో ఉన్నఅమ్మ గదిలోకి వెళ్లగానే అక్కడే కొన్ని ఫైళ్లు మరో పెన్ను కిందపడి ఉండటాన్ని గమనించినట్లు కన్నన్ వివరించాడు.ఇక స్పృహ కోల్పోయి ఉన్న జయలలితను కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించినట్లు గుర్తుచేశాడు. రెండు సార్లు ప్రయత్నించాక... ఆ ప్రయత్నాన్ని విరమించి స్ట్రెచర్‌లో అమ్మను తరలించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
#kannan
#sasikala
#jayalalithaa
#sivakumar