పక్కా ప్లాన్‌తో మోడీ కొట్టిన దెబ్బ! దిగివచ్చిన విజయ్ మాల్యా

  • 6 years ago
Vijay Mallya's recent Twitter activity is anything to go by it may very well be true that the walls may be finally closing in on him. Because there is clearly a sense of urgency and panic in Mallya's desperate bid to clear his position.
#india
#vijaymallya
#arunjaitley
#narendramodi

బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా మెట్టు దిగి, తాను డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని తాజాగా వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాదు, తాను రెండేళ్ల క్రితమే ప్రధాని మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు రుణాలు చెల్లిస్తానని లేఖ రాశానని, కాని వారి నుంచి స్పందన రాలేదని చెబుతూ.. కేంద్రంపైకి తప్పు నెట్టే ప్రయత్నం చేశారు.
కానీ, రెండేళ్ల క్రితం రాసిన లేఖను విజయ్ మాల్యా ఇప్పుడు ఎందుకు బయటపెట్టారు? ఇన్నాళ్లు ఎందుకు దానిపై మాట్లాడలేదు? సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీని ఇరుకున పడేసేందుకు ఇప్పుడు ఈ లేఖలు విడుదల చేశారా? లేక మరోదైనా ఉందా? అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. మాల్యా లేఖ రాసినా.. అతనితో పాటు అతని లాంటి వారి నుంచి రుణాలు వసులు చేసేందుకు కొత్త చట్టం కోసం మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిందని అంటున్నారు. ఆ చట్టం రావడంతో మాల్యా ఇప్పుడు దిగొచ్చారని చెబుతున్నారు.