అభివృద్ది ఇలా జరుగుతోంది సింగపూర్‌ బృందానికి వివరించిన మంత్రి నారా లోకేష్‌
  • 6 years ago
Andhra Pradesh (AP) Chief Minister Chandrababu Naidu presided over the signing of a MoU between the AP government and Flextronics on Tuesday.

సింగపూర్‌ సోషల్‌ అండ్‌ ఫ్యామిలీ డెవలప్‌మెంట్‌ డేస్మాన్డ్‌ లీ బృందంతో మంత్రి నారా లోకేష్‌ బుధవారం అమరావతిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి మంత్రి నారా లోకేష్‌ వివరించారు. ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని లోకేష్ తెలిపారు. అమరావతి, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు సింగపూర్ బృందానికి ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డ్రోన్‌ పెట్రోలింగ్‌ గురించి వివరిస్తూ విశాఖపట్నం సముద్ర తీరం, బీచ్‌ ఏరియాలో ప్రమాదాల నివారణకు, నిఘాకి ఈ టెక్నాలజీ ఎంత గానో ఉపయోగపడుతుందని లోకేష్ చెప్పారు.
డ్రోన్ల ద్వారా బీచ్‌ ప్రాంతంలో 24/7 నిఘా ఉండే అవకాశం ఉందని, అక్కడ జరిగే క్రైమ్‌ లేదా ప్రమాదాలను ముందుగానే గుర్తించి సంబంధిత అధికారులను అలర్ట్‌ చేసే అవకాశం ఉందని మంత్రి లోకేష్ వివరించారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీ, టూరిజం అభివృద్ధి లో తమకు సింగాపూర్‌ సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్‌ కోరారు. దీనిపై స్పందించిన డేస్మాన్డ్ లీ డ్రోన్ పెట్రోలింగ్‌లో సహకారం అందిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్స్, టూరిజం అభివృద్ధిలో సింగాపూర్ సహకరించాలని మంత్రి కోరగా, ఈ రెండు రంగాల అభివృద్ధికి పూర్తిగా సహకారం అందిస్తామని డేస్మాన్డ్ లీ పేర్కొన్నారు.
Recommended