వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రభుత్వం ఓ రహస్య సర్వే
  • 6 years ago
As news is making rounds that early elections would take place, politics in AP are taking twists and turns. According to sources, Majority of the MLA's who switched from YCP to TDP will not be allocated the TDP ticket in the coming elections.

ముందస్తు ఎన్నికలు వస్తాయని జోరుగా వార్త ప్రచారంలో ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై పరోక్షంగా సంకేతాలు కూడా ఇస్తుండటంతో అనుమానం మరింత బలపడింది. దీంతో ఏపీలో రాజకీయం మరింత రంజుగా మారింది. అప్పుడే సీట్ల పంచాయతీ మొదలైనట్లు తెలుస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నట్లు సమాచారం. అటు టీడీపీలో ఇమడలేక ఇటు వైసీపీలోకి రాలేక తమలో తామే మదనపడుతున్నట్లు కొందరు ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేల పరిస్థితిపై టీడీపీ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. ఇప్పటికే మంత్రి పదవులు దక్కించుకున్న వైసీపీలోని నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు మాత్రమే సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయానికొస్తే... వచ్చే ఎన్నికల్లో ఎవరెవరికి టికెట్ కేటాయించాలి... వారి గెలుపు అవకాశాలు ఏమేరకు ఉంటాయన్న దానిపై ప్రభుత్వం ఓ రహస్య సర్వే చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ సర్వేలో టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా గెలవరని తేల్చి చెప్పిందట.
Recommended