అంతర్జాతీయ యోగా దినోత్సవం: డెహ్రాడూన్‌లో ప్రధాని మోడీ, అమరావతిలో చంద్రబాబు

  • 6 years ago
From Dehradun to Dublin, Shanghai to Chicago, Jakarta to Johannesburg, Yoga has become a unifying force, Prime Minister Narendra Modi said. He was addressing a gathering at the Forest Research Institute in Dehradun, Uttarakhand on the occasion of International Yoga Day.

నేడు (21 జూన్) అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో పాల్గొన్నారు. ఈ ఏడాది శాంతి కోసం యోగా పేరుతో నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా దాదాపు 5 వేల కార్యక్రమాలు జరుగుతాయని ఆయుష్‌ శాఖ తెలిపింది. 150కి పైగా దేశాల్లోనూ భారత రాయబార కార్యాలయాలు స్థానికులతో కలిసి యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. డెహ్రాడూన్‌లో జరిగిన యోగా దినోత్సవంలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ... యోగా సాధనతో శాంతి, ఆరోగ్యం, సంతోషం ప్రాప్తిస్తాయన్నారు.
నేడు ప్రతి దేశం యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నాయని, అతి తక్కువ సమయంలోనే యోగానే ప్రపంచవ్యాప్తం అయిందన్నారు. యోగాను భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయన్నారు. సూర్యుడి కిరణాలు అన్ని వైపులా చేరినట్లే యోగా కూడా అంతటా చేరుతోందన్నారు. యోగా అనేది ప్రాచీన, ఆధునిక ఆరోగ్య సాధనమని ప్రతి ఒక్కరూ దీన్ని ఆరోగ్య సాధనంగా మలుచుకోవాలన్నారు.

Recommended