రైల్వే ప్రయాణికులకు కొత్త స్కీం

  • 6 years ago
After a drive to catch passengers carting excess baggage, the railways has now decided to go after ticketless travellers from June 8 to June 22, the Railway Board said today.
#RailwayBoard
#ticketless

టిక్కెట్ లేకుండా రైల్వేలో ప్రయాణించడం నేరం. అయినప్పటికీ చాలామంది టిక్కెట్ తీసుకోకుండా ప్రయాణిస్తారు. టిక్కెట్ కలెక్టర్లకు దొరకకుండా చాలా ప్రయత్నాలు కూడా చేస్తారు కొందరు. తాజాగా రైల్వే శాఖ టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారిని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేస్తుంది. జూన్ 8 (నేడు) నుంచి జూన్ 22వ తేదీ వరకు టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన నివేదికను ఈ నెల 23న ప్రిన్సిపల్ కమర్షియల్ మేనేజర్లకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ డ్రైవ్‌లో టికెట్ లేని ప్రయాణికులకు భారీగా జరిమానాలు విధించనుంది. టికెట్ ట్రాన్స్‌ఫర్, టికెట్ లెస్, నకిలీ, ఫోర్జ్‌డ్ టికెట్లపై దృష్టి సారిస్తున్నారు. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లను నిర్ణీత సమయంలో గమ్యానికి చేర్చేందుకు చర్యలు ప్రారంభించిన రైల్వే ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైలు ప్రయాణికులకు మరింత సురక్షితమైన, నాణ్యమైన సేవలు అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా టికెట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేయనుంది.

Recommended