వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మరో ప్రముఖ నటి సంగీత
  • 6 years ago
ప్రముఖ తమిళ నటి సంగీత బాలన్‌ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పనయూర్‌ ప్రాంతంలోగల ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ నిర్వహించగా సంగీతతో పాటు పలువురు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్లు సమాచారం.
ఈ దాడిలో పోలీసులు పలువురు మహిళలతో పాటు విటులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన మహిళలు నార్త్ ఇండియాకు చెందిన వారిగా గుర్తించారు. వీరిని పునరావాస కేంద్రానికి తరలించారు.
వ్యభిచార గృహం నిర్వహిస్తున్న సంగీతకు సహకరిస్తున్న సురేష్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే వీరిని ఎగ్మూరులోని మోట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. చాలా కాలం తర్వాత తమిళనాడులో సెక్స్ రాకెట్లో సినీ నటి పేరు వినిపించడం చర్చనీయాంశం అయింది.
సంగీత బాలన్ 1996లో వచ్చిన కరప్పురోజా సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించారు. పలు తమిళ చిత్రాల్లో, టీవీ సీరియల్స్‌లో నటించారు. తమిళ ఛానల్ సన్ టీవీలో ప్రసారం అవతున్న పాపులర్ టీవీ సీరియల్‌ రాణీ-వాణీలో రాధిక శరత్ కుమార్‌తో సంగీత బాలన్ నటించారు.
Recommended